

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత జట్టు 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది సౌతాఫ్రికా. మూడో మ్యాచ్ డిసెంబర్ 14న ధర్మశాలలో జరుగుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేయగిలిగింది. డికాక్ 90 పరుగులతో అద్భుతంగా రాణించాడు.
మొదటి టీ20 మ్యాచ్‌లో ఓటమి చవి చూపిన దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌లో దూకుడు కనబరిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగలిగింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు డికాక్ కీలకంగా నిలిచాడు. 90 పరుగులతో జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు. భారత బౌలర్లు ఈమారు తడబడటంతో ప్రత్యర్థి పరుగులు పిండుకోగలిగారు.
నిలకడగా ఆడుతున్న డికాక్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో 16వ ఓవర్లో రన్ ఔట్‌గా వెనుదిరగడంతో భారత్‌కు కీలక వికెట్ లభించింది. అయితే, డెత్ ఓవర్లలో భారత్ బౌలర్లు డీలా పడటంతో మళ్లీ కోలుకున్న దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరు చేసింది. డికాక్ జట్టుకు కీలకంగా నిలవగా మార్క్రమ్(29), డోనొవాన్ ఫరీరా(30), డేవిడ్ మిల్లర్ (20) చివరి ఓవర్లలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్‌ను తీశారు. అర్ష్‌దీప్ నాలుగు ఓవర్లలో 54 పరుగులు ఇచ్చుకోవడంతో పాటు ఒకే ఓవర్లో ఏకంగా ఏడు వైడ్స్ వేసి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
సమాధానంగా, భారత జట్టు పేలవమైన ఆరంభాన్ని పొందింది. పవర్ ప్లేలో జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. శుభ్‌మాన్ గిల్ సున్నా పరుగులకే, అభిషేక్ శర్మ 17 పరుగులకే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐదు పరుగులకే ఔటయ్యారు. అక్కడి నుంచి, హార్దిక్ పాండ్యాతో కలిసి అక్షర్ పటేల్ ఇన్నింగ్స్‌ను స్థిరీకరించడానికి ప్రయత్నించారు. కానీ హార్దిక్ పాండ్యా (20) 118 పరుగుల వద్ద ఔటైన తర్వాత, భారత జట్టు త్వరగా వికెట్లు కోల్పోయి 162 పరుగులకే ఆలౌట్ అయింది. తిలక్ వర్మ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
దక్షిణాఫ్రికా తరఫున ఒట్నీల్ బార్ట్‌మన్ నాలుగు వికెట్లు పడగొట్టగా. లుంగి న్గిడి, మార్కో జాన్సెన్, లూథో సిపామ్లా తలా రెండు వికెట్లు పడగొట్టారు








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!