

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ దిల్లీ క్యాపిటల్స్‌తో కొత్త బాధ్యతలు చేపట్టారు. 2027 ఐపీఎల్ సీజన్ నుంచి ఆ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని దిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. “దిల్లీ.. దాదాగిరి చేసే సమయం వచ్చింది” అంటూ గంగూలీకి స్వాగతం పలికింది. ఐపీఎల్‌లో ఓ జట్టుకు గంగూలీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.
దిల్లీ క్యాపిటల్స్‌తో గంగూలీకి ఇప్పటికే సుదీర్ఘ అనుబంధం ఉంది. 2019లో సలహాదారుగా ఆ ఫ్రాంచైజీతో ప్రయాణం ప్రారంభించిన ఆయన.. అనంతరం పురుషుల, మహిళల జట్లకు క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేశారు. గత కొన్ని సీజన్లుగా దిల్లీ క్యాపిటల్స్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కోచింగ్ బృందంలో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవని దిల్లీకి గంగూలీ కొత్త బాధ్యతలతో తొలి ట్రోఫీ అందిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!