

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, ఐసీసీ స్కాట్లాండ్కు అవకాశం కల్పించింది. ఈ మెగాటోర్నీకి స్కాట్లాండ్ తమ 15 మంది సభ్యుల జట్టును అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో రిచీ బెరింగ్టన్ స్కాట్లాండ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. భారత ఉపఖండ పరిస్థితుల్లో పోటీకి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని క్రికెట్ స్కాట్లాండ్ అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రూప్ Cలో స్కాట్లాండ్ ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్, వెస్ట్ ఇండీస్ జట్లతో తలపడనుంది. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్ట్ ఇండీస్‌తో జరగనుంది.
స్కాట్లాండ్ జట్టు: రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ కరీ, ఒలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీక్స్, ఫిన్లే మెక్‌క్రీత్, బ్రాండన్ మెక్‌ములెన్, జార్జ్ మున్సీ, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.
ట్రావెలింగ్ రిజర్వులు: జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్.
నాన్-ట్రావెలింగ్ రిజర్వులు: మెక్కెన్జీ జోన్స్, క్రిస్ మెక్‌బ్రైడ్, చార్లీ టియర్.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!