

ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఉజ్బెకిస్థాన్‌పై పోర్చుగల్ జట్టు 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో పోర్చుగల్ రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లు సాధించగా, తదుపరి దశకు చేరేందుకు మరో మ్యాచ్ కీలకంగా మారింది.
మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రోనాల్డోకు లియోనెల్ మెస్సి గురించి వరుసగా ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘మీరిద్దరూ ఆరోసారి వరల్డ్ కప్ ఆడుతున్నారు’ అనే ప్రశ్నకు రోనాల్డో ‘ఎలాంటి వ్యాఖ్య చేయను’ అని సమాధానం ఇచ్చాడు. మెస్సి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్ చేశాడని ఓ విలేకరి ప్రశ్నించగా, ‘వేరే ప్రశ్న అడగండి’ అంటూ రోనాల్డో అసహనం వ్యక్తం చేశాడు.
మెస్సితో మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుందని అడిగిన ప్రశ్నకు రోనాల్డో స్పందిస్తూ, అలాంటి పోరు జరిగితే అద్భుతంగా ఉంటుందని చెప్పాడు. మరోవైపు మెస్సి నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు ఇప్పటికే నాకౌట్ దశకు చేరుకుంది. రోనాల్డో మీడియా సమావేశంలో ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!