

భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో ఫిట్నెస్ సమస్యలు తలెత్తకపోతే, అలాగే తాము కొనసాగాలని భావిస్తే ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు బరిలోకి దిగే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి. వారి అపారమైన అనుభవంపై బోర్డు నమ్మకంతో ఉన్నట్లు సమాచారం.
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో రోహిత్, కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో వారి భవిష్యత్తుపై చర్చ మొదలైంది. నాలుగు ఇన్నింగ్స్‌లలో రోహిత్ కేవలం 30 పరుగులే చేయడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే, ఫామ్ కంటే దక్షిణాఫ్రికా పిచ్‌లపై వారి అనుభవమే జట్టుకు కీలకమని బీసీసీఐ అధికారులు భావిస్తున్నట్లు కథనాలు చెబుతున్నాయి. ఎంతకాలం క్రికెట్ ఆడాలనేది పూర్తిగా రోహిత్, కోహ్లీల వ్యక్తిగత నిర్ణయమని, వారు కొనసాగాలని భావిస్తే 2027 ప్రపంచకప్‌లో వారి సేవలు జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!