
క్రీడలు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత మహిళల జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ప్రతీక రావల్ (81 బంతుల్లో 52; 6 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70 బంతుల్లో 54; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో జట్టుకు బలమైన స్కోరు అందించారు.
స్మృతి మంధాన (31), కాశ్వీ గౌతమ్ (25), రిచా ఘోష్ (22) కీలక పరుగులు చేశారు. క్రాంతి గౌడ్ (19), అమన్‌జ్యోత్ కౌర్ (13), జెమీమా రోడ్రిగ్స్ (11), దీప్తి శర్మ (1) ఆశించిన స్థాయిలో రాణించలేదు. శ్రీ చరణి (10*) మరియు వైష్ణవి శర్మ (0*) నాటౌట్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అలానా కింగ్ తలో రెండు వికెట్లు తీయగా, మేగాన్ షట్, నికోలా కేరీ చెరో వికెట్ సాధించారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!