

రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంటూ లక్నో సూపర్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 38 బంతుల్లో 93 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్ కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును విజయతీరాలకు చేర్చారు.
యశస్వీ జైస్వాల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ 43 పరుగులు చేయగా, వైభవ్ పవర్‌ప్లే తర్వాత పూర్తిగా చెలరేగిపోయాడు. కేవలం 23 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చివర్లో ధ్రువ్ జురెల్ అజేయంగా 53 పరుగులు చేసి మ్యాచ్‌ను సునాయాసంగా ముగించాడు. ఫెరీరా సిక్సర్‌తో రాజస్థాన్ విజయాన్ని ఖరారు చేసింది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!