

భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ కీలక పదవులను ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెంటర్, సీఈవో లేదా స్ట్రాటజిక్ పార్టనర్ వంటి మూడు కీలక స్థానాలను అతనికి ప్రతిపాదించినట్లు సమాచారం. ఫ్రాంఛైజీ వాటాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాల నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జాతీయ జట్టుకు ప్రధాన శిక్షకుడిగా ఉన్న గంభీర్ ఈ ఆఫర్‌ను అంగీకరించే అవకాశం తక్కువగా ఉందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.
బీసీసీఐతో ఉన్న ఒప్పందం ప్రకారం గంభీర్ 2027 ప్రపంచ కప్ వరకు భారత జట్టు హెడ్ కోచ్‌గా కొనసాగనున్నారు. ప్రస్తుతం భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 ప్రపంచ కప్ 2026పై ఆయన పూర్తి దృష్టి సారించారు. అలాగే 2027లో దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచ కప్ కూడా ఉండటంతో జాతీయ జట్టుకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశముందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ ప్రతిపాదనను అంగీకరిస్తే భారత హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!