
క్రీడలు

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఆమె ఇంగ్లాండ్‌కు బయలుదేరింది. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అనేక విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆమె ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది.
‘‘తదుపరి నోటీసు వరకు అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు’’ అని సింధు సోషల్ మీడియాలో వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులకు దిగిన నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో గగనతలాన్ని మూసివేయడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామాలతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!