
సినిమాలు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరియు డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి / చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో విజయాలతో రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు ఇండోనేషియా క్రీడాకారిణి పుత్రి కుసుమ వార్దాని పై 21-17, 21-18 తేడాతో గెలిచి తదుపరి దశకు చేరుకుంది.
పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ మలేసియా ఆటగాళ్లు చెన్ జి/ప్రెస్లీ స్మిత్‌పై 26-28, 21-15, 21-1తో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అయితే మిగతా భారత షట్లర్లు తొలి రౌండ్లోనే నిరాశపరిచారు. ఆయుష్ శెట్టి, ఉన్నతి హుడా, అర్జున్/హరిహరన్, సిమ్రన్/కవిప్రియ, శిఖా గౌతమ్/అశ్వినీ భట్, రుత్వికా శివాని/రోహన్ కపూర్ జోడీలు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!