
షోస్

ఖేలో ఇండియా 8వ ఎడిషన్‌కు సంబంధించిన ప్రత్యేక లోగోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ లోగోను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించింది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా దీనిని తీర్చిదిద్దారు. ఖేలో ఇండియా క్రీడా వేడుకలో తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పేలా సంప్రదాయ చిహ్నాలు, సాంస్కృతిక అంశాలకు లోగోలో ప్రాధాన్యత కల్పించారు.
తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టకు ఈ లోగోలో ప్రత్యేక స్థానం కల్పించారు. గాంధీ సరోవర్‌లో నిర్మించనున్న గాంధీ విగ్రహ ప్రాజెక్టు, రాష్ట్ర చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచే కాకతీయ తోరణం, తెలంగాణ రాష్ట్ర పుష్పమైన తంగేడు పూలను కూడా లోగోలో పొందుపరిచారు. ఈ అంశాల ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని క్రీడా వేదికపై ప్రత్యేకంగా చాటిచెప్పే ప్రయత్నం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!