

భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. 2023 వన్డే ప్రపంచకప్ లో రోహిత్ శర్మ ఆధ్వర్యం లోని టీమ్ అద్భుతంగా ఆడి వరుసగా 10 విజయాలు సాధించినప్పటికీ, అహ్మదాబాద్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో పరాజయం చెందింది. ఆ ఓటమి ఇంకా ఆటగాళ్లను వెంటాడుతూనే ఉందని సూర్యకుమార్ మాటలు సూచించాయి.
ఇప్పుడు 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్ కూడా అదే వేదిక అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా తోనే తలపడాలని తాను కోరుకుంటున్నట్లు సూర్యకుమార్ స్పష్టం చేశారు. “అహ్మదాబాద్… ఆస్ట్రేలియా” అని వెంటనే చెప్పడం ద్వారా ఆయనకు ఆ ఓటమిపై ఉన్న పగ ఎంత బలంగా ఉందో తెలుస్తోంది.
ఇటీవల ప్రకటించిన గ్రూప్ వివరాల ప్రకారం, భారత్ గ్రూప్ Aలో పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాతో కలిసి ఉంది. ఆస్ట్రేలియా గ్రూప్ B లో శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్‌తో ఉంది. వేదికలు మరియు పూర్తి షెడ్యూల్ త్వరలో వెల్లడించునున్నాయ్ .
సూర్యకుమార్ అభిప్రాయానికి భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా స్పందించారు. ఇటీవలి మహిళా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ గెలుచుకున్న ఆమె, “మాకు ఆడటానికి ఇష్టమైన జట్టు ఆస్ట్రేలియానే. అలాంటి విజయాలే ఎక్కువ కాలం గుర్తుంటాయి” అని చెప్పారు. గతంలో భారత జట్లు కొన్నిసార్లు ఆస్ట్రేలియాను ఓడించినప్పటికీ, 2023 ఫైనల్లో జరిగిన ఓటమి మాత్రం ఇంకా పెద్ద సవాలుగానే మిగిలిపోయింది.


.png&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!