

వెస్టిండీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ 2–0తో సొంతం చేసుకుంది. మూడో టెస్టులో 323 పరుగుల భారీ తేడాతో కరీబియన్ జట్టును ఓడించింది. 462 పరుగుల లక్ష్యంతో ఐదో రోజు ఆటను 43/0తో ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు 138 పరుగులకే కుప్పకూలింది. ఒక దశలో 87/0తో మంచి స్థితిలో కనిపించిన విండీస్, కేవలం 51 పరుగుల వ్యవధిలో పది వికెట్లు కోల్పోయింది.
ఈ మ్యాచ్‌లో పేసర్ జాకబ్ డఫీ 5/42తో అద్భుత ప్రదర్శన చేశాడు, అజాజ్ పటేల్ 3/23తో సహకరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 575/8 వద్ద డిక్లేర్ చేయగా, వెస్టిండీస్ 420 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌ను కివీస్ 306/2 వద్ద ముగించారు. తొలి ఇన్నింగ్స్‌లో ద్విశతకం, రెండో ఇన్నింగ్స్‌లో శతకం సాధించిన డెవన్ కాన్వేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్‌లో 23 వికెట్లు తీసిన జాకబ్ డఫీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం లభించింది. తొలి టెస్టు డ్రా కాగా, రెండో మరియు మూడో టెస్టుల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది.
ఈ సిరీస్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్ రెండో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్ ఆరో స్థానంలో నిలిచింది.









.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!