

లాసాన్ డైమండ్ లీగ్ జావెలిన్ త్రోలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అదరగొట్టాడు. 88.05 మీటర్ల సీజన్ బెస్ట్ త్రోతో రెండో స్థానంలో నిలిచాడు. తన రెండో ప్రయత్నంలో 88.05 మీటర్లు విసిరిన నీరజ్ కొద్దిసేపు అగ్రస్థానానికి చేరుకున్నాడు. అయితే శ్రీలంకకు చెందిన రుమేశ్ పతిరాగే 88.14 మీటర్ల త్రోతో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చి చివరకు విజేతగా నిలిచాడు.
గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 86.69 మీటర్ల బెస్ట్ త్రోతో మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. నాలుగో ప్రయత్నంలో నీరజ్ ఫౌల్ చేయగా, చివరి ప్రయత్నంలో 82.15 మీటర్లు మాత్రమే నమోదు చేశాడు. దీంతో తన స్కోర్‌ను మెరుగుపరుచుకోలేక రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
లాసాన్ వేదికగా నీరజ్‌కు ఇది మరో మంచి ప్రదర్శన. 2022లో 89.08 మీటర్లతో విజేతగా నిలిచిన ఆయన, 2023లో 87.66 మీటర్లతో టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 2024లో 89.49 మీటర్లతో రన్నరప్‌గా నిలిచాడు. తాజాగా 88.05 మీటర్ల త్రోతో ఈ సీజన్‌లో తొలిసారి 88 మీటర్ల మార్క్‌ను దాటాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!