
జనరల్

భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు సమాచారం. దీంతో సుదీర్ఘమైన 13 ఏళ్ల టెస్ట్ ప్రయాణానికి ఆయన ముగింపు పలికినట్లయింది. 2013 నవంబర్ 7న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం 64 మ్యాచ్‌లు ఆడిన ఆయన 229 వికెట్లు పడగొట్టి భారత జట్టులో కీలక పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
టెస్ట్ క్రికెట్‌లో షమీ ఆరు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించారు. సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, వన్డేలు, టీ20లు, ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో కొనసాగనున్నట్లు సమాచారం. షమీ టెస్ట్ రిటైర్మెంట్‌తో భారత క్రికెట్‌లో ఒక కీలక అధ్యాయానికి ముగింపు పలికినట్లయింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!