Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఫిఫా 2026. నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా మెక్సికో

11:14 AM, 19 జూన్, 2026
ఫిఫా 2026.  నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా మెక్సికో

ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆతిథ్య మెక్సికో జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. గురువారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో మెక్సికో 1–0 తేడాతో దక్షిణ కొరియాపై ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ప్రస్తుత ప్రపంచకప్‌2026లో అధికారికంగా నాకౌట్ చేరిన మొదటి జట్టుగా మెక్సికో అవతరించింది. గత 2022 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన మెక్సికో.. ఈసారి సొంత గడ్డపై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది.

మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగినప్పటికీ.. కొరియా డిఫెండర్లు చేసిన చిన్నపాటి తప్పిదాలు మెక్సికోకు వరంగా మారాయి. మ్యాచ్ 50వ నిమిషంలో దక్షిణ కొరియా గోల్‌కీపర్ కిమ్ సీయుంగ్ గ్యు, డిఫెండర్ లీ గి హ్యుక్ ఒకరినొకరు ఢీకొట్టడంతో బంతి చేజారింది. అక్కడే సిద్ధంగా ఉన్న మెక్సికో ప్లేయర్ లూయిస్ రోమో.. లూజ్ బాల్‌ను సులువుగా గోల్ పోస్ట్‌లోకి పంపి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.

మ్యాచ్ ముగిసే సమయానికి (87వ నిమిషంలో) కొరియా స్టార్ చో గ్వే సంగ్ కొట్టిన హెడర్‌ను, ఆపై వచ్చిన రీబౌండ్‌ను మెక్సికో గోల్‌కీపర్ రాహుల్ రంగెల్ అద్భుతమైన డైవ్‌తో అడ్డుకుని జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. గ్రూప్-ఎ లో ఆరు పాయింట్లతో మెక్సికో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే గ్రూప్‌లో జరిగిన చెక్ రిపబ్లిక్, దక్షిణాఫ్రికాల మ్యాచ్1-1తో డ్రా ముగిసింది. మరో మ్యాచ్‌లో ఆతిథ్య కెన‌డా బోణీ కొట్టింది. గ్రూప్‌-బిలో ఉన్న కెన‌డా 6-0తో ఖ‌తార్‌పై భారీ విజయాన్ని న‌మోదు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒక జెర్సీ.. కోట్లాది మంది కలలు.. మెస్సీ ప్రత్యేకత

ఒక జెర్సీ.. కోట్లాది మంది కలలు.. మెస్సీ ప్రత్యేకత

ధోనీ మాటతో భారత్ విజయం

ధోనీ మాటతో భారత్ విజయం

పాక్ క్రికెటర్ల జీతాలు పెంచిన పీసీబీ

పాక్ క్రికెటర్ల జీతాలు పెంచిన పీసీబీ

ఫిఫాలో హార్ట్ టచింగ్ మూమెంట్..తల్లి–కొడుకు కలయిక

ఫిఫాలో హార్ట్ టచింగ్ మూమెంట్..తల్లి–కొడుకు కలయిక

ఒలింపిక్ స్వర్ణమే లక్ష్యం - మన్‌ప్రీత్ సింగ్

ఒలింపిక్ స్వర్ణమే లక్ష్యం - మన్‌ప్రీత్ సింగ్

ఫిఫా టోర్నీలో వింత సమస్యలో జర్మనీ జట్టు

ఫిఫా టోర్నీలో వింత సమస్యలో జర్మనీ జట్టు

ట్యాగ్లు
ఫిఫా2026వరల్డ్ కప్మెక్సికోనాకౌట్సౌత్ కొరియా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్‌
ఓటీటీ

‘దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్‌

పెళ్లి గురించి రష్మిక షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

పెళ్లి గురించి రష్మిక షాకింగ్ కామెంట్స్!

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ మార్పులు
బిజినెస్

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ మార్పులు

సంధ్య థియేటర్ కేసులో కీలక పరిణామం.. అల్లు అర్జున్‌కు సమన్లు
సినిమాలు

సంధ్య థియేటర్ కేసులో కీలక పరిణామం.. అల్లు అర్జున్‌కు సమన్లు

ఒక జెర్సీ.. కోట్లాది మంది కలలు.. మెస్సీ ప్రత్యేకత
క్రీడలు

ఒక జెర్సీ.. కోట్లాది మంది కలలు.. మెస్సీ ప్రత్యేకత

మేకెదాటు ప్రాజెక్టుపై విజయ్ గట్టి వైఖరి.. కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు
జనరల్

మేకెదాటు ప్రాజెక్టుపై విజయ్ గట్టి వైఖరి.. కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు

ఎన్నారై డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
బిజినెస్

ఎన్నారై డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం

వర్షాలకు చెక్.. అత్యాధునిక సైలోలతో ధాన్యం భద్రత
రాజకీయాలు

వర్షాలకు చెక్.. అత్యాధునిక సైలోలతో ధాన్యం భద్రత

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి : పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్
జనరల్

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి : పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్

మా ఇంటి బంగారం మూవీ రివ్యూ: సమంత వన్ ఉమెన్ షో!
రివ్యూలు

మా ఇంటి బంగారం మూవీ రివ్యూ: సమంత వన్ ఉమెన్ షో!

కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టిన నార్నె నితిన్
సినిమాలు

కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టిన నార్నె నితిన్

NBK-111లో కాజల్ ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
సినిమాలు

NBK-111లో కాజల్ ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!