

ఇండియా–న్యూజిలాండ్ తొలి వన్డే మ్యాచ్‌కు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గురువారం ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయాలను ప్రారంభించగా, కేవలం 8 నిమిషాల్లోనే అన్ని టిక్కెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. దీంతో ఈ మ్యాచ్ పై అభిమానుల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువైంది.
ప్రత్యేకంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో అభిమానులు పోటెత్తుతున్నట్లు తెలుస్తోంది. టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రో–కో జోడీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతుండటంతో, వారి బ్యాటింగ్‌ను మరోసారి ఆస్వాదించాలనే ఆసక్తి మరింత పెరిగింది.
ఇటీవల ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లతో పాటు విజయ్ హజారే ట్రోఫీలో కూడా వీరిద్దరూ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. టాప్ ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరి ప్రదర్శనను స్టేడియంలో చూసేందుకు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఆఫ్‌లైన్ టిక్కెట్ల విక్రయానికి సంబంధించిన తేదీలను ఇంకా నిర్వాహకులు ప్రకటించలేదు. అవి కూడా ప్రకటిస్తే టిక్కెట్ కౌంటర్ల వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో బారులు తీరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఈ నెల 11న భారత క్రికెట్ జట్టు, న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన టీమ్ ఇండియా జట్టును శనివారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!