
క్రీడలు

సూపర్- 8 దశలో నెట్ రన్ రేట్ సమీకరణాల కారణంగా టీమ్ ఇండియా సెమీ ఫైనల్ మార్గం క్లిష్టంగా మారింది. మొదటి పరిస్థితిలో వెస్టిండీస్ 200 పరుగులు చేసి, దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో లక్ష్యాన్ని చేధిస్తే వెస్టిండీస్ నెట్ రన్ రేట్ + 2.22గా, దక్షిణాఫ్రికా నెట్ రన్ రేట్ + 2.40 గా ఉంటుంది. ఇతర జట్లపై ఆధారపడకుండా ఉండాలంటే ఇండియా సుమారు 250 పరుగులు చేసి, జింబాబ్వేపై కనీసం 150 పరుగుల భారీ తేడాతో గెలవాలి.
రెండో పరిస్థితిలో దక్షిణాఫ్రికా 200 పరుగులు చేసి, వెస్టిండీస్ 18 ఓవర్లలో చేధిస్తే వెస్టిండీస్ నెట్ రన్ రేట్ +3.28 కి, దక్షిణాఫ్రికా నెట్ రన్ రేట్ +1.50 కి చేరుతుంది. ఈ పరిస్థితిలో కూడా ఇండియా జింబాబ్వేపై భారీ విజయంతోనే ముందుకు రావాలి. తదుపరి కోల్‌కతాలో జరిగే చివరి సూపర్ - 8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడిస్తేనే ఇండియా సెమీ ఫైనల్ ఆశలు తమ చేతుల్లోనే ఉంటాయి.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!