

టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్ విజయం సాధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి టీమ్ ఇండియాకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ విజయం దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు భారత జట్టు సమన్వయం, ధైర్యసాహసాలతో అద్భుత ఆటతీరును ప్రదర్శించిందని ప్రశంసించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రతిభ చూపి యువతకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.
ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కూడా అభినందనలు తెలిపారు. భారత్ టీ20 వరల్డ్‌కప్‌ను మూడుసార్లు గెలిచిన ఏకైక దేశంగా నిలిచిందని, వరుసగా రెండుసార్లు ట్రోఫీ సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ విజయం దేశ క్రీడా రంగానికి మరింత గౌరవం తీసుకొచ్చిందని నేతలు అభిప్రాయపడ్డారు.




.jpg&w=3840&q=75)



.jpeg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!