
క్రీడలు

ఐపీఎల్ 2026లో 51వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్పై 8 వికెట్ల తేడాతో గెలిచిన కేకేఆర్‌కు ఓపెనర్ ఫిన్ అలెన్ అద్భుత సెంచరీతో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చాడు. కేవలం 47 బంతుల్లోనే అజేయ శతకం బాదిన అలెన్.. 5 ఫోర్లు, 10 సిక్సర్లతో చెలరేగి కేకేఆర్‌ను 14.2 ఓవర్లలోనే విజయ తీరాలకు చేర్చాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుంది. పాతుమ్ నిస్సంక అర్ధసెంచరీతో రాణించగా, అశుతోష్ శర్మ 39 పరుగులతో మెరిపించాడు. అయితే సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఢిల్లీని 142/8కే పరిమితం చేశారు. అనంతరం కామరూన్ గ్రీన్ 33 పరుగులతో అలెన్‌కు చక్కటి సహకారం అందించాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!