
గాసిప్స్

ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో మెరిశాడు. 337 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టు తరఫున కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. 91 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేసిన కోహ్లీ తన 54 వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. ఈ సెంచరీతో న్యూజిలాండ్‌పై అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్‌గా కోహ్లీ (7 సెంచరీలు) నిలిచాడు. ఇది అతని కెరీర్లో 85 వ అంతర్జాతీయ సెంచరీ కాగా, భారత్‌లో సాధించిన 41వ శతకం కూడా ఇదే. చివరికి 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 124 పరుగులు చేసి కోహ్లీ ఔటయ్యాడు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!