
క్రీడలు

ఐపీఎల్ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే సీజన్‌కు సూర్యకుమార్ యాదవ్‌ను కొనసాగించడంపై ముంబై ఇండియన్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో భారత స్టార్ బ్యాటర్ వచ్చే సీజన్‌లో ముంబై జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం సూర్యకుమార్ యాదవ్ ప్రతినిధులతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. అతడిని తిరిగి జట్టులోకి తీసుకురావడమే కాకుండా, కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించే ఆలోచనలో కేకేఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. జట్టు భవిష్యత్ నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!