

టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ వేదికలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక మార్పులు ప్రకటించింది. కొన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అదనపు వేదికలను ఖరారు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం శ్రీలంకకు స్వదేశంలో సెమీ ఫైనల్ ఆడే అవకాశం లభించింది. శ్రీలంక చివరి నాలుగులోకి చేరి భారత్ లేదా పాకిస్థాన్ కాకుండా మరో జట్టును ఎదుర్కొంటే, ఆ మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానంలో జరుగుతుంది.
ఒకవేళ పాకిస్థాన్ సెమీ ఫైనల్‌కు చేరుకుంటే మొదటి సెమీ ఫైనల్ కొలంబోలోనే జరుగుతుంది. పాకిస్థాన్ అర్హత సాధించకపోయినా, శ్రీలంక అర్హత సాధించి భారత్‌ను తప్ప మరో జట్టుతో తలపడితే కూడా అదే వేదికలో మ్యాచ్ జరుగుతుంది. అయితే శ్రీలంక, పాకిస్థాన్ రెండూ అర్హత సాధించకపోతే, ఆ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు మారుతుంది. రెండో సెమీ ఫైనల్ మాత్రం ముంబయిలోని వాంఖడే మైదానంలోనే జరుగుతుంది.
భారత్ సెమీ ఫైనల్‌కు వస్తే ప్రత్యర్థి ఎవరైనా వాంఖడే వేదికగా ఉంటుంది. కానీ భారత్–పాకిస్థాన్ సెమీ ఫైనల్ జరిగితే మాత్రం మ్యాచ్ కొలంబోకు మారుతుంది. మూడు జట్లు కూడా అర్హత సాధించకపోతే, సూపర్–8 గ్రూప్‌లలో అగ్రస్థానాలు సాధించిన జట్ల కాంబినేషన్ ప్రకారం కోల్‌కతా, ముంబయిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈసారి గ్రూప్ కాంబినేషన్ ఆసక్తికరంగా మారింది.












.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!