
జనరల్

మోకాలి గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు పోటీలకు దూరమైన తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ ఘనంగా పునరాగమనం చేసింది. జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్ హీట్ రేసును 13.14 సెకన్లలో పూర్తి చేసి ఆసియా క్రీడలకు అర్హత సాధించింది. ఆసియా క్రీడల అర్హత ప్రమాణమైన 13.34 సెకన్ల కంటే మెరుగైన టైమింగ్ నమోదు చేసి తన ఫిట్‌నెస్‌ను మరోసారి నిరూపించింది. విశాఖపట్నానికి చెందిన 26 ఏళ్ల జ్యోతి 2022 ఆసియా క్రీడల్లో రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే.
మరోవైపు ఆసియా చాంపియన్, జాతీయ రికార్డు గ్రహీత గుల్వీర్ సింగ్ పురుషుల 5,000 మీటర్ల రేసులో 13 నిమిషాల 52.92 సెకన్లతో విజేతగా నిలిచాడు. అయితే ఆసియా క్రీడలకు అవసరమైన 13 నిమిషాల 39.18 సెకన్ల అర్హత సమయాన్ని అందుకోలేకపోయాడు. అయినప్పటికీ ఆయన ప్రదర్శన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఆకట్టుకుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!