
ఐపీఎల్ 2026 ఎడిషన్‌కు మరో రెండు వారాలు మాత్రమే ఉండటంతో చెన్నై సూపర్ కింగ్స్‌లో ఎంఎస్ ధోని ఏ పాత్ర పోషిస్తాడనే విషయం చర్చనీయాంశంగా మారింది. సీఎస్‌కే తన తొలి మ్యాచ్‌లో మార్చి 30న రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఇప్పటికే జట్టు యువ క్రికెటర్లు సాధన ప్రారంభించగా, ధోని కూడా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎస్‌కే మాజీ ఆటగాడు సుబ్రమణియన్ బద్రినాథ్ స్పందిస్తూ ధోని పాత్రపై జట్టు మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని ఆసక్తిగా ఉందన్నారు.
సీఈవో ధోని అన్ని మ్యాచులకు సిద్ధంగా ఉన్నాడని చెప్పినప్పటికీ అది పూర్తిగా పరిపాలనా నిర్ణయమో కాదో తెలియదని బద్రినాథ్ అన్నారు. ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధోనిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే ఆడమని లేదా ఏదైనా మ్యాచ్‌లో పక్కన పెట్టమని చెప్పడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ధోని మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నందున ఈ సీజన్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశముందని చెప్పారు. అలాగే ఏప్రిల్ 5న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌పై కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.




.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!