

ఆర్సీబీ అభిమానులకు గుడ్న్యూస్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో (Chinnaswamy Stadium) ఐపీఎల్ మరియు అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించడానికి అనుమతి లభించింది అని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) శనివారం ప్రకటించింది. ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు సూచించిన నిబంధనలను పాటిస్తూ మ్యాచ్లు నిర్వహించబడుతాయి.
గతంలో, ఐపీఎల్ 2025లో ఆర్సీబీ విజయం సాధించిన సందర్భంగా జూన్ 4 న చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు జరిగినప్పుడు స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైకెల్ డి.కున్హా నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ వేసింది. ఈ కమిషన్ చిన్నస్వామి స్టేడియం మ్యాచ్ల నిర్వహణకు సురక్షితం కాదని తేల్చింది.
ఈ క్రమంలో కొన్ని షరతులతో మ్యాచ్లు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!