

ఐపీఎల్ చరిత్రలో ప్రతి సంవత్సరం వేలం వేళ కొత్త రికార్డులు నమోదు కావడం సహజం. 2023లో సామ్ కరన్ ₹18.5 కోట్లు, 2024 లో మిచెల్ స్టార్క్ ₹24.75 కోట్లు, 2025 లో రిషబ్ పంత్ ఏకంగా ₹27 కోట్ల భారీ ధరకు అమ్ముడవడం అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు 2026 ఐపీఎల్ వేలం దగ్గరపడుతున్న నేపథ్యంలో, ఈసారి ఎవరు రికార్డు ధరతో అమ్ముడవుతారు? అనేది అభిమానులు, ఫ్రాంచైజీలు, క్రికెట్ నిపుణుల మధ్య పెద్ద చర్చగా మారింది.
ఇప్పటికే వేలం జాబితాలో ఉన్న కామెరాన్ గ్రీన్, రవి బిష్ణోయ్, డెవోన్ కాన్వే, రచిన్ రవీంద్ర, జోష్ ఇంగ్లిస్, డేవిడ్ మిల్లర్ వంటి స్టార్ ప్లేయర్లకు భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా మహిళా యజమానులు కావ్యా మారన్ (SRH), ప్రీతి జింటా (PBKS), నీతా అంబానీ (MI) మధ్య గ్రీన్ & బిష్ణోయ్ కోసం బిడ్డింగ్ వార్ జరగబోతుందని అంచనాలు.
రిషబ్ పంత్ సాధించిన ₹27 కోట్ల రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఆల్రౌండర్లు, హార్డ్ హిట్టర్లు, స్పెషలిస్టు స్పిన్నర్లపై భారీ డిమాండ్ నేపథ్యంలో ఈసారి ధరలు మరింత పెరగనున్నాయి. కొన్ని జట్లు ఒక్క ఆటగాడికే ₹30 కోట్లకుపైనే వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
మొత్తానికి 2026 ఐపీఎల్ వేలం కొత్త రికార్డులను సృష్టించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈసారి అత్యంత ఖరీదైన ప్లేయర్ ఎవరు? అన్న ఉత్కంఠ డిసెంబర్ 16 వేలంలో తీరనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!