

నేడు భారత్‌కు పలు క్రీడాంశాల్లో కీలక పోటీలు ఉన్నాయి. పురుషుల టీమ్ సెమీస్‌లో భారత్ చైనాతో ఉదయం 11.30 గంటలకు తలపడనుంది. మహిళల హాకీ పూల్-బి మ్యాచ్‌లో భారత్ థాయ్‌లాండ్‌తో ఉదయం 11.30 గంటలకు ఆడనుంది. మహిళల కబడ్డీలో భారత్ ఇరాన్‌తో ఉదయం 8.30 గంటలకు, పురుషుల కబడ్డీలో బంగ్లాదేశ్‌తో ఉదయం 9.45 గంటలకు పోటీపడనుంది. సెపక్‌తక్రాలో పురుషుల రెగు గ్రూప్-బి మ్యాచ్‌లో భారత్ ఫిలిప్పీన్స్‌తో ఉదయం 5.30 గంటలకు తలపడనుంది.
ఇక బాక్సింగ్‌లో పురుషుల 80 కిలోల రౌండ్-16లో అంకుశ్ బరిలోకి దిగనున్నాడు. ఈక్వెస్ట్రియన్‌లో ఆశిష్, మీర్జా క్రాస్ కంట్రీలో పోటీపడనున్నారు. షూటింగ్‌లో ఇషా సింగ్, సురుచి సింగ్, మను బాకర్ ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్‌లో పాల్గొననుండగా, స్కీట్ విభాగంలో అంజీత్ సింగ్, గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్, రిజా డిల్లాన్, మహేశ్వరి చౌహాన్ పోటీపడనున్నారు. స్క్వాష్‌లో అభయ్ సింగ్, తన్వీ ఖన్నా, వీర్ చొట్రాని బరిలోకి దిగనున్నారు. స్విమ్మింగ్‌లో రోహిత్, సాజన్ ప్రకాశ్, అనీష్, వేదాంత్ మాధవ్ పోటీపడనున్నారు. టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో హర్మీత్–యశస్విని, మానుష్ షా–దియా జోడీలు, వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, జ్ఞానేశ్వరి దేవి, ఉషులో రోషిబినా దేవి భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!