

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశలో భారత్ మహిళల జట్టు బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో సెమీఫైనల్ అవకాశాలను మరింత బలోపేతం చేసుకుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. జువైరియా ఫెర్దోస్ 33, కెప్టెన్ నిగర్ సుల్తానా 32 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ 3 వికెట్లతో మెరిసగా, శ్రీ చరణి రెండు వికెట్లు పడగొట్టింది. రేణుక సింగ్, నందిని శర్మ చెరో వికెట్ తీశారు.

137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ షెఫాలీ వర్మ దూకుడైన ఆరంభాన్ని అందించింది. కేవలం 34 బంతుల్లో 53 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది. జెమిమా రోడ్రిగ్స్ 26, యాస్తికా భాటియా 23 పరుగులతో జట్టుకు అండగా నిలిచారు. బంగ్లాదేశ్ బౌలర్ రీతు మోని రెండు వికెట్లు తీసినా భారత్ 16.5 ఓవర్లలోనే 139/5తో లక్ష్యాన్ని ఛేదించి ఐదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించిన షెఫాలీ వర్మకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!