

వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను గెలిచిన భారత్ ఇప్పుడు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. లఖ్‌నవూలోని ఎకానా స్టేడియంలో మంగళవారం తొలి టీ20 జరగనుంది. టీ20ల్లో ఎలాంటి జట్టునైనా ఓడించగల సత్తా ఉన్న వెస్టిండీస్‌ను ఎదుర్కోవాలంటే భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. షై హోప్, హెట్‌మయర్, రొవ్మన్ పావెల్, షెర్ఫానీ రూథర్‌ఫర్డ్ వంటి దూకుడైన బ్యాటర్లు విండీస్‌కు బలం. రొమారియో షెఫర్డ్, షమార్ స్ప్రింగర్ ఆల్‌రౌండర్లుగా కీలకంగా మారే అవకాశం ఉంది. అకీల్ హొసీన్, గుడాకేశ్ మోటీ స్పిన్ విభాగాన్ని బలోపేతం చేస్తున్నారు. భారత్ జట్టులో ఓపెనింగ్ స్థానంపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీలలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబెతో భారత బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నప్పటికీ.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నుంచి భారీ ఇన్నింగ్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
లఖ్‌నవూలోని ఎకానా స్టేడియం పిచ్ సాధారణంగా కొంత నెమ్మదిగా ఉంటుంది. ఇక్కడ 160-170 పరుగులు కూడా పోటీ స్కోర్లుగా నిలిచే అవకాశముంది. పేసర్లకు కొంత సహకారం లభించడంతో పాటు స్పిన్నర్లు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ తరఫున అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు చేపట్టవచ్చు. అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లలో ఒకరు పేస్ దాడిని నడిపించే అవకాశం ఉంది. ఎకానా స్టేడియంలో భారత్ ఇప్పటివరకు ఆడిన మూడు టీ20ల్లోనూ విజయం సాధించింది. స్వదేశంలో వెస్టిండీస్‌తో ఆడిన 11 టీ20ల్లో భారత్ తొమ్మిది గెలిచి, రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. మొత్తంగా ఇరు జట్లు 31 టీ20ల్లో తలపడగా భారత్ 20 విజయాలు, వెస్టిండీస్ 10 విజయాలు సాధించాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!