

అండర్-19 ఆసియా కప్ 2025లో అజేయంగా ఫైనల్‌కు చేరిన యువ భారత్‌కు చివరి మ్యాచ్‌లో తీవ్ర నిరాశ ఎదురైంది. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో అన్ని విభాగాల్లో వెనుకబడి, భారత్ 191 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. 348 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన టీమిండియా 26.2 ఓవర్లలోనే 156 పరుగులకు ఆలౌటైంది. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన దీపేశ్ దేవేంద్రన్ (36) టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.
ఒక దశలో భారత్ 120 పరుగులకే 9 వికెట్లు కోల్పోయినా, దీపేశ్ పోరాటంతో స్కోరు 150 దాటింది. వైభవ్ సూర్యవంశీ (26), ఖిలాన్ పటేల్ (19), ఆరోన్ జార్జ్ (16), అభిజ్ఞాన్ కుందు (13) మాత్రమే కొంత ప్రతిఘటన చూపించారు. పాక్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు తీయగా, మహ్మద్ సయామ్, అబ్దుల్ సుభాన్, హుజైఫా అహ్సాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (172) అద్భుత శతకంతో మ్యాచ్‌ను పూర్తిగా తమవైపు తిప్పాడు. అహ్మద్ హుస్సేన్ (56) హాఫ్ సెంచరీతో మద్దతిచ్చాడు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు తీయగా, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో రెండు వికెట్లు సాధించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!