

వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు బీసీసీఐ టీమిండియా జట్లను ప్రకటించింది. వన్డే జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా కొనసాగనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ తిరిగి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గర్నూర్ బ్రార్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైశ్వాల్, నామన్ ధీర్, ఔకిబ్ నబీ కూడా జట్టులో ఉన్నారు. నామన్ ధీర్, ఔకిబ్ నబీలకు తొలిసారి వన్డే జట్టులో అవకాశం లభించింది. రిషభ్ పంత్‌కు చోటు దక్కలేదు. ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు పంత్ నాయకత్వం వహించనున్నారు.
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ జట్టులో ఉన్నారు. వెస్టిండీస్‌తో మూడు వన్డేలు సెప్టెంబర్ 27, సెప్టెంబర్ 30, అక్టోబర్ 3 తేదీల్లో, ఐదు టీ20లు అక్టోబర్ 6, 9, 11, 14, 17 తేదీల్లో జరగనున్నాయి. నాలుగో టీ20 హైదరాబాద్‌లో జరగనుంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!