

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనం కోసం నేరేడుచెరువులోకి దిగిన ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతులను నర్సింహ రాజు, సుమంత్, గణేష్, ఉదయ్ కిరణ్, శ్యామ్ కుమార్, సిద్దార్థ్‌గా గుర్తించారు. వీరిలో సుమంత్, గణేష్ డిప్లొమా రెండో సంవత్సరం, ఉదయ్ కిరణ్ డిప్లొమా మూడో సంవత్సరం, శ్యామ్ కుమార్ డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్నారు. సిద్దార్థ్ పదో తరగతి విద్యార్థి. వీరంతా శిరీష చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన విద్యార్థులుగా గుర్తించారు.
ఈ ఘటనపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పండుగ వేళ ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఘటనపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్న మంత్రి, సహాయక చర్యలు మరియు బాధిత కుటుంబాలకు అందుతున్న సహాయంపై ఆరా తీశారు. పిల్లల భద్రతకు అవసరమైన చర్యలను సమన్వయంతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల్లో చిన్నారులు ప్రమాదకరమైన నీటి వనరుల వద్దకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!