

ICC మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ Aలో జరిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా అమెరికాపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా చెలరేగి 49 బంతుల్లో 84 పరుగులు (10 ఫోర్లు, 4 సిక్సులు) చేసి జట్టును పోరాట స్కోర్‌కు చేర్చాడు. తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20) కీలకంగా సహకరించారు. అమెరికా బౌలర్లలో షాక్విక్ 4 వికెట్లతో మెరిశాడు.
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్ఏ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. మిలింద్ (34), సంజయ్ (37), శుభం (37) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ తలో 2 వికెట్లు, వరుణ్ ఒక వికెట్ పడగొట్టారు. సమిష్టి ప్రదర్శనతో టీమిండియా కీలక విజయం నమోదు చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!