

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయానికి చేరువైంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 34 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. దీంతో చివరి రోజు ఆ జట్టు మరో 288 పరుగులు చేయాల్సి ఉండగా, భారత్ విజయానికి ఆరు వికెట్లు మాత్రమే కావాలి. ధనంజయ డి సిల్వా 31, సోనల్ దినూష 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. మనవ్ సుతార్ రెండు, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేయగా, దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో అదరగొట్టాడు. కేఎల్ రాహుల్ 82, ధ్రువ్ జురేల్ 51 పరుగులు చేశారు. శ్రీలంక 284 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్‌కు 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులు చేయగా, రిషభ్ పంత్ 66 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం టీమిండియా పూర్తి ఆధిపత్యంలో ఉన్నప్పటికీ, గాలేలో చివరి రోజు వర్షం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!