
గాసిప్స్

టీమిండియా మహిళల స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాటర్‌గా, ఓవరాల్‌గా నాలుగో బ్యాటర్‌గా ఆమె రికార్డులకెక్కింది.
మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మిథాలీ రాజ్ (10,868) అగ్రస్థానంలో ఉండగా, న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ (10,652), ఇంగ్లండ్‌కి చెందిన షార్లెట్ ఎడ్వర్డ్స్ (10,273) తర్వాత స్మృతి మంధాన నిలిచింది. ఈ మ్యాచ్‌లో స్మృతి 11 ఫోర్లు, 3 సిక్సులతో 80 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఈ ప్రదర్శనతో తన టీ20 కెరీర్లో 32వ అర్ధశతకాన్ని పూర్తి చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!