

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025 తొలి సెమీ–ఫైనల్లో బంగ్లాదేశ్ A జట్టు పూర్తిగా మ్యాచ్ చిత్రాన్ని మార్చేసింది. 18 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 160 దాటుతుందా అన్న అనుమానం ఉండగా, చివరి రెండు ఓవర్లలో బ్యాట్స్‌మెన్ చేసిన దాడి ఆ లెక్కలన్నీ తారుమారు చేసింది. కేవలం 12 బంతుల్లోనే 50 పరుగులు రాబట్టడంతో బంగ్లాదేశ్ A జట్టు 20 ఓవర్లలో భారీగా 194 పరుగులు చేసింది. ఈ విధ్వంసానికి ప్రధాన కారణం మెహరూబ్ హసన్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్. 19వ ఓవర్ – 28 పరుగులు : ఈ కీలక ఓవర్‌ను వేసిన భారత బౌలర్ నమన్ ధీర్ తీవ్రంగా దెబ్బతిన్నాడు మెహరూబ్ హసన్: మొదటి బంతి – సిక్సర్ 3వ & 4వ బంతులు – వరుస సిక్సర్లు 5వ బంతి – ఫోర్ 6వ బంతి – సిక్సర్ మొత్తం: 28 పరుగులు 20వ ఓవర్ – 22 పరుగులు : చివరి ఓవర్లో వైశాఖ్ విజయ్‌కుమార్ కూడా భారీ పరుగులు ఇచ్చాడు.
యాసిర్ అలీ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టగా, చివరి బంతికి మెహరూబ్ మరో సిక్సర్ బాదాడు.మొత్తం: 22 పరుగులు ప్రధాన స్కోరర్ హబీబుర్ రెహమాన్ సోహన్ – 46 బంతుల్లో 65 (3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెహరూబ్ హసన్ – 18 బంతుల్లో అజేయంగా 48 (6 సిక్సర్లు) భారత బౌలర్ల ప్రదర్శన నమన్ ధీర్ – 2 ఓవర్లు, 33 పరుగులు (Economy 16.50) వైశాఖ్ విజయ్‌కుమార్ – 4 ఓవర్లు, 51 పరుగులు రమన్‌దీప్ సింగ్ – 2 ఓవర్లు, 29 పరుగులు గుర్జప్నీత్ సింగ్ – 4 ఓవర్లు, 39 పరుగులు, 2 వికెట్లు చివరి రెండు ఓవర్లలో వచ్చిన 50 పరుగులు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కు పూర్తిగా టోన్ మార్చి, మ్యాచ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!