

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీజీ టీ20 లీగ్‌ను అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరిగిన కార్యక్రమంలో లోగోను జస్టిస్ నవీన్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్, కృష్ణమాచారి శ్రీకాంత్, అంబటి రాయుడుతో పాటు సీపీ సి. వి. ఆనంద్ పాల్గొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో ఈ లీగ్ నిర్వహించనున్నారు.
జూన్, జూలై నెలల్లో జరిగే ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొనగా, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈ 8 జట్ల యాజమాన్యానికి సుమారు 40 కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ లీగ్ ద్వారా ప్రతిభావంతులైన స్థానిక ఆటగాళ్లు వెలుగులోకి వస్తారని నిర్వాహకులు ఆశిస్తున్నారు. ఈ టోర్నీ మంచి ఆలోచన అని జస్టిస్ నవీన్‌రావు అభిప్రాయపడ్డారు. అలాగే, హెచ్‌సీఏకు 94 ఏళ్ల చరిత్ర ఉందని అంబటి రాయుడు పేర్కొంటూ, స్థానిక ఆటగాళ్లను ఐపీఎల్‌లోకి తీసుకోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ ను కోరారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!