

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఘన ప్రదర్శన కనబరిచారు. ఐదు టీ20 ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లో తిలక్ వర్మ (73), హార్దిక్ పాండ్యా (63) అర్ధశతకాలతో చెలరేగి టీమిండియాకు భారీ స్కోరు అందించారు. వారి ధాటికి భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు భారత ఓపెనర్లు సంజూ శాంసన్ (37), అభిషేక్ శర్మ (34) షాకిచ్చారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ కలిసి 63 పరుగులు జోడించారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ త్వరగానే ఔటైనా, వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్ వర్మ 42 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో 73 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 25 బంతుల్లో 5 సిక్స్‌లు, 5 ఫోర్లతో 63 పరుగులు చేసి బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఆరంభంలో దూకుడుగా ఆడింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 35 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. బ్రెవిస్‌తో కలిసి తొలి 10 ఓవర్లలోనే స్కోరును 118 పరుగులకు చేర్చారు. ఆ దశలో మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపు మొగ్గినట్లే కనిపించినా, డికాక్ ఔటైన తర్వాత వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మార్క్రామ్, డేవిడ్ మిల్లర్ వంటి కీలక బ్యాటర్లను తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు పంపాడు. చివర్లో కార్బిన్ బాష్, జార్జ్ లిండే ప్రయత్నించినా ఫలితం లేకుండా దక్షిణాఫ్రికా 201కే పరిమితమైంది. వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 17 పరుగులకే 2 వికెట్లు తీసుకోగా, హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లోనూ రాణించాడు. దీంతో భారత్ 30 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!