

ఏ ఫార్మాట్ అయినా దూకుడుగా ఆడటం యువరాజ్ సింగ్ నైజం. 18 ఏళ్ల క్రితమే ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన యువీ, టీ20 క్రికెట్లో ఇప్పటికీ ఎవరూ చేరలేని ఘనత సాధించాడు. ఈ కారణంగానే అభిమానులు అతడిని ‘సిక్సర్ల కింగ్’ అని ప్రేమగా పిలుస్తారు.
మొత్తం 402 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన యువీ, 11,778 పరుగులతో పాటు 148 వికెట్లు తీసి భారత క్రికెట్ చరిత్రలో గొప్ప ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో అతడి పాత్ర కీలకమైనది. 2011 తర్వాత క్యాన్సర్‌తో పోరాడి విజయవంతంగా మళ్లీ మైదానంలోకి వచ్చి అద్భుత ప్రదర్శనలు ఇచ్చాడు. అయితే 2019లో వన్డే వరల్డ్ కప్‌కు ఎంపిక కాకపోవడంతో కొద్ది రోజుల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు.
తాజాగా న్యూ చండీగఢ్ స్టేడియంలోని ఒక స్టాండ్‌కు అతడి పేరు పెట్టడం ద్వారా యువీ సేవలకు అరుదైన గౌరవం లభించింది. భారత క్రికెట్ కోసం అతడు చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమే. యూ ఆర్ ఏ జెమ్, యూవీ - హ్యాపీ బర్త్‌డే ఛాంప్!




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!