
జనరల్

గువాహటిలోని బర్సాపరా స్టేడియంలో సెప్టెంబర్ 30న భారత్–వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డే పరుగుల వరదలా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 405 పరుగులు చేయగా, భారత్ 43.3 ఓవర్లలోనే 406 పరుగులు చేసి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో వన్డేల్లో భారత్ అత్యధిక విజయవంతమైన ఛేజ్‌ను నమోదు చేసింది.
అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పిచ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ బ్యాట్, బాల్ మధ్య మరింత పోటీ ఉండాలని, బౌలర్లకు కూడా సహకారం లభించేలా పిచ్‌లు ఉండాలని అన్నారు. భారీ స్కోర్లు, కొత్త రికార్డులు అభిమానులు, ప్రసారకర్తలకు ఆసక్తికరంగా ఉండొచ్చని, కానీ బౌలర్లకు ఎలాంటి అవకాశం లేని పరిస్థితులు క్రికెట్‌కు మంచివి కావని గంభీర్ అభిప్రాయపడ్డారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!