

గ్రూప్-కెలో జరిగిన కీలక పోరులో డీఆర్ కాంగోపై 1-0తో విజయం సాధించిన కొలంబియా నాకౌట్ దశకు అర్హత సాధించింది. డేనియల్ మునోజ్ 76వ నిమిషంలో చేసిన ఏకైక గోల్ జట్టుకు విజయాన్ని అందించింది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన కొలంబియా ఆరు పాయింట్లతో రౌండ్-32లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. మ్యాచ్ ఆరంభంలోనే కొలంబియా వరుస దాడులతో ఒత్తిడి పెంచినా, కాంగో గోల్‌కీపర్ లియోనెల్ ఎంపాసి అద్భుతమైన సేవ్‌లతో జట్టును నిలబెట్టాడు.
రెండో అర్ధభాగంలో కూడా కాంగో పటిష్ట రక్షణతో పోరాడినా, పెనాల్టీ ప్రాంతంలో వచ్చిన రీబౌండ్ బంతిని మునోజ్ గోల్‌గా మలచడంతో కొలంబియా ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి నిమిషాల్లో కాంగోకు స్కోరు సమం చేసే అవకాశాలు వచ్చినప్పటికీ, గోల్‌కీపర్ కామిలో వార్గస్ అద్భుత సేవ్‌లతో విజయాన్ని కాపాడాడు. చివరి గ్రూప్ మ్యాచ్‌లో పోర్చుగల్‌తో కొలంబియా తలపడనుండగా, డ్రా సాధించినా గ్రూప్ టాపర్‌గా నాకౌట్ దశలోకి అడుగుపెడుతుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!