
జనరల్

ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ సీజన్లో మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లను ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఆయన లేఖ రాశారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.
మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ల కోసం కొత్త షెడ్యూల్ రూపొందించి, కొన్ని వేదికల్లో మాత్రమే మ్యాచ్లను నిర్వహించాలని గోయల్ సూచించారు. దీంతో లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ ఆదా అవుతాయని తెలిపారు. జట్ల తరచూ ప్రయాణాలు తగ్గితే విమాన ఇంధన నిల్వలపై పడే భారం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన క్రీడా ఈవెంట్లు, జాతీయ వనరుల వినియోగంపై చర్చకు దారితీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!