

జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో మిక్స్‌డ్ కాంపౌండ్ ఆర్చరీలో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించిన తెలంగాణకు చెందిన చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌లను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ విజయంతో చికిత 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌కు అర్హత సాధించిందని పేర్కొన్నారు.
ఒకేరోజు తెలంగాణకు రెండు స్వర్ణ పతకాలు అందించి రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చికితను సీఎం ప్రశంసించారు. పెద్దపల్లికి చెందిన చికిత ప్రతిభను గుర్తించి ఆమెకు అండగా నిలిచిన తల్లిదండ్రులు, కోచ్‌లను కూడా అభినందించారు. కాంపౌండ్ ఉమెన్స్ టీమ్ విభాగంలో స్వర్ణం సాధించిన అనంతరం.. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సాహిల్ జాదవ్‌తో కలిసి దక్షిణ కొరియాపై విజయం సాధించి మరో స్వర్ణాన్ని కైవసం చేసుకోవడం తెలంగాణ క్రీడా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. చికిత నిరంతర సాధన, పట్టుదల, దృఢసంకల్పంతో సాధించిన ఈ విజయం రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!