

వన్డే ప్రపంచకప్‌కు మరో ఏడాది సమయం మాత్రమే ఉండటంతో టీమ్‌ఇండియా 50 ఓవర్ల మెగా టోర్నీకి సన్నాహాలను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. 2027 ప్రపంచకప్‌లో ఆడనున్నట్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఇప్పటికే స్పష్టం చేయడంతో ఈ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. ఆసియా క్రీడల్లో భారత టీ20 జట్టు బరిలోకి దిగుతున్న సమయంలోనే శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని వన్డే జట్టు విండీస్‌తో పోరుకు సిద్ధమైంది. తిరువనంతపురం వేదికగా తొలి వన్డే జరగనుంది. ఇంగ్లాండ్‌లో జులైలో వన్డేలు ఆడిన తర్వాత కోహ్లి, రోహిత్ ఈ సిరీస్‌తో మళ్లీ వన్డే బరిలోకి దిగుతున్నారు.
రోహిత్ శర్మతో కలిసి శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుండగా, విరాట్ కోహ్లి మూడో స్థానంలో, రుతురాజ్ గైక్వాడ్ నాలుగో స్థానంలో ఆడే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. రవీంద్ర జడేజా నుంచి ఆల్‌రౌండ్ ప్రదర్శనను జట్టు ఆశిస్తోంది. కుల్‌దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. నితీశ్‌కుమార్ రెడ్డి పేస్ ఆల్‌రౌండర్‌గా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కొత్త బంతిని పంచుకునే అవకాశం ఉంది. మరోవైపు షై హోప్ నేతృత్వంలోని విండీస్ జట్టులో రోస్టన్ చేజ్, జస్టిన్ గ్రీవ్స్, షెర్ఫానీ రూథర్‌ఫర్డ్ కీలక ఆటగాళ్లు. తిరువనంతపురం పిచ్ బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా సహకరించే అవకాశముంది.
అంచనా తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, నితీశ్‌కుమార్ రెడ్డి, గుర్నూర్ బ్రార్, కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.
వెస్టిండీస్: జాన్ క్యాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్, కీసీ కార్టీ, షై హోప్ (కెప్టెన్), షెర్ఫానీ రూథర్‌ఫర్డ్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, గుడాకేశ్ మోటీ, జేడెన్ సీల్స్, షమర్ జోసెఫ్, అల్జారి జోసెఫ్.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!