
గాసిప్స్

భారత అండర్ 19 క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ.7.5 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించింది. టోర్నమెంట్ అంతటా జట్టు చూపిన స్థిరత్వం, క్రమశిక్షణ, పోరాట స్పూర్తిని అభినందిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
నిన్న జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి భారత్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. సమిష్టి ఆటతీరుతో టీమ్ ఇండియా ఘన విజయం సాధించి దేశానికి గర్వకారణమైంది. యువ ఆటగాళ్లు మరియు సహాయక సిబ్బంది కృషిని ప్రశంసించిన బీసీసీఐ, ఈ నజరానా భవిష్యత్ క్రికెటర్లకు మరింత ప్రోత్సాహం ఇస్తుందని పేర్కొంది.
.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!