

ఫిఫా ప్రపంచకప్ ప్రచారాన్ని అమెరికా జట్టు ఘన విజయంతో ప్రారంభించింది. లాస్ ఏంజెల్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పరాగ్వేపై 4-1 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభమైన ఏడో నిమిషంలో వెస్టన్ మెకెన్నీ ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో పరాగ్వే ఆటగాడు డామియన్ బొబాడిల్లా స్వయంగా గోల్ చేయడంతో అమెరికా ఖాతా తెరిచింది. అనంతరం ఫోలారిన్ బలోగన్ 31వ మరియు 44వ నిమిషాల్లో రెండు అద్భుత గోల్స్ సాధించి అమెరికాకు భారీ ఆధిక్యాన్ని అందించాడు.
రెండోార్థంలో పరాగ్వే తరఫున మౌరిసియో 73వ నిమిషంలో ఒక గోల్ చేసి స్కోరు తగ్గించినా, అదనపు సమయంలో జియోవాని రేయ్నా మరో గోల్ నమోదు చేసి అమెరికా విజయాన్ని ఖరారు చేశాడు. బలోగన్ అద్భుత ప్రదర్శనతో పాటు పులిసిక్, మాలిక్ టిల్మన్, అలెక్స్ ఫ్రీమన్ వంటి ఆటగాళ్ల సహకారంతో అమెరికా జట్టు టోర్నీలో శుభారంభం చేసింది. ఈ విజయం ద్వారా ప్రపంచకప్‌లో తమ సత్తాను అమెరికా ఘనంగా చాటుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!