
గాసిప్స్

న్యూజిలాండ్ తో జరిగే వన్డే సిరీస్ కు టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యాడు. తొలి వన్డేలో గాయపడిన సుందర్ వన్డే సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఆల్ రౌండర్ ఆయుష్ బదోనిని ఎంపిక చేశారు. సుందర్ స్థానంలో ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల ఆయుష్ బదోని జట్టులోకి ఎంపికయ్యాడు. ఆయుష్‌కి తొలిసారిగా టీమిండియా నుంచి పిలుపు వచ్చింది.
ఆయుష్ బదోని ఇప్పటివరకు లిస్ట్ ఎ క్రికెట్లో 27 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో, అతను 22 ఇన్నింగ్స్‌లు ఆడి 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో 693 పరుగులు చేశాడు. అతను 18 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున 56 మ్యాచ్‌లు ఆడి మొత్తం 6 హాఫ్ సెంచరీలతో 963 పరుగులు చేశాడు. ఇప్పుడు, అతను తొలిసారి టీమ్ ఇండియాలోకి అడుగుపెట్టాడు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!