
బిజినెస్

భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్‌కు భారత అండర్-19 జట్టులో చోటు లభించింది. శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత పురుషుల, మహిళల అండర్-19 వన్డే మరియు టీ20 జట్లను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ ఎంపికల్లో హైదరాబాద్‌కు చెందిన వి. యశ్వీర్ గౌడ్, వి. ప్రతీక్ష, అలాగే గుంటూరుకు చెందిన కె. దీక్ష కూడా చోటు దక్కించుకోవడం విశేషం.
పురుషుల వన్డే, టీ20 జట్లకు యశ్‌బర్దన్ సింగ్ చౌహాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయగా, మహిళల జట్లకు భావికా అహిరే నాయకత్వం వహించనుంది. హైదరాబాద్‌కు చెందిన ఎడమచేతి స్పిన్నర్ యశ్వీర్ గౌడ్ పురుషుల వన్డే జట్టులో స్థానం సంపాదించగా, గుంటూరు అమ్మాయి కె. దీక్ష రెండు జట్లకు వికెట్ కీపర్‌గా ఎంపికైంది. హైదరాబాద్ బ్యాటర్ వి. ప్రతీక్ష మహిళల వన్డే జట్టులో చోటు దక్కించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!