
క్రీడలు

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి బీహార్ – జార్ఖండ్ ప్రాంతంలో అత్యధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా ధోని నిలిచినట్లు రాంచీ ఆదాయపు పన్ను ప్రధాన చీఫ్ కమిషనర్ డాక్టర్ డి. సుధాకర్ రావు వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా కూడా ధోని ఆదాయం, బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదని ఈ రికార్డు స్పష్టం చేస్తోంది.
క్రికెట్‌తో పాటు వ్యాపారాలు, ప్రకటనలు, పెట్టుబడుల ద్వారా ధోని భారీ ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది. అభిమానుల్లో ఇప్పటికీ ఆయనకు ఉన్న క్రేజ్ కారణంగా అనేక ప్రముఖ బ్రాండ్లు ధోనితో ఒప్పందాలు కొనసాగిస్తున్నాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా దేశవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన క్రీడాకారుల్లో ధోని ఒకరిగా కొనసాగుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!